Breaking News

టీఎస్​ఐపాస్​తో 15రోజుల్లో అనుమతులు

టీఎస్ఐపాస్తో 15రోజుల్లో అనుమతులు

సామాజిక సారథి, హైదరాబాద్‌: టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇండస్ర్టియల్‌ పాలసీ తీసుకొచ్చామని, దీని ద్వారా 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 17,500 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. రాష్ర్టానికి రూ.2.30వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు రావడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఐఏఎంసీకి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. పారిశ్రామికీకరణలో దేశంలో తెలంగాణ ముందు ఉందని మంత్రి కేటీఆర్​తెలిపారు. పరిశ్రమలు స్థాపనను సులభతరం చేసేందుకు టీఎస్‌ ఐపాస్‌ తెచ్చామన్నారు. ఈనెల 18 నుంచి ఇంటర్‌ నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ మీడియేషన్‌ సెంటర్‌ పనిచేస్తోందని, తెలంగాణ నుంచి ఈ సెంటర్‌ పూర్తి సహకారం అందిస్తోందన్నారు.