Breaking News

మోడీ, కేసీఆర్​లకు ప్రజలే గుణపాఠం చెబుతారు..

మోడీ, కేసీఆర్లకు ప్రజలే గుణపాఠం చెబుతారు..
  • సాగుచట్టాల రద్దు కాంగ్రెస్‌ విజయం: పొన్నాల

సామాజిక సారథి, హైదరాబాద్‌: మదమెక్కిన ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లకు ప్రజలే గుణపాఠం చెబుతారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.  సలహాలు తీసుకోకుండా నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌ను మోడీ తెచ్చారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ  ముందే చెప్పారని ఆయన పేర్కొన్నారు. సాగుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడం రైతులు, కాంగ్రెస్‌ విజయమన్నారు. గోదాముల్లో బియ్యం నిల్వలు ఉంటే కేంద్ర వ్యవసాయ మంత్రి ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విదేశాలకు ఎగుమతులను పెంచాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా? అని పొన్నాల నిలదీశారు.