సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లా రైతులు, ప్రజలకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మడం, సరఫరా చేయడం, తయారుచేయడం చేస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ హెచ్చరించారు. వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు అలా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వ్యాపారం చేయుదలుచుకున్నవారు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడొద్దని సూచించారు. ప్రభుత్వం అనుమతి పొందిన కంపెనీకి చెందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని కోరారు. రిసిప్ట్ ను మీ వద్ద భద్రంగా ఉంచుకోవాలని కోరారు.
- May 29, 2021
- Archive
- Top News
- మహబూబ్నగర్
- AGRICULTURE
- NAGARKURNOOL
- SEEDS
- నకలీ సీడ్స్
- నాగర్ కర్నూల్
- వ్యవసాయశాఖ
- Comments Off on నకిలీ సీడ్స్ అమ్మితే పీడీయాక్టు