Breaking News

ములుగు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

ములుగు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

సారథి న్యూస్, ములుగు: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.కృష్ణ ఆదిత్య తెలిపారు. ఆదివారం శాసనమండలి ఎన్నికల పోలింగ్ సరళిని ములుగు, వెంకటాపురం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎన్నికల కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలో మొత్తం పోలైన ఓట్లలో పురుషులు 5,705 మంది, స్త్రీలు 2,489 మంది వేశారని, పోలింగ్ శాతం 79.38శాతం మేర నమోదైనట్లు చెప్పారు. ఆయా పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర జాయింట్ సీఈవో రవికిరణ్ పరిశీలించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, డిఆర్ఓ కె.రమాదేవి వివరించారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల నోడల్ ఆఫీసర్లు, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అభినందనలు తెలిపారు.