న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తండ్రి చనిపోయినట్టు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ‘మిస్ యూ పాప్పా’ అంటూ చిరాగ్ ట్వీట్ చేశారు.ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు దళితనేతగా మంచి పేరుఉంది.
- October 8, 2020
- Archive
- Top News
- జాతీయం
- BJP
- CONGRESS
- MINISTER
- NDA
- PASHWAN
- PASSESAWAY
- UPA
- కన్నుమూత
- కేంద్రమంత్రి
- పాశ్వాన్
- Comments Off on పాశ్వాన్ ఇకలేరు