సారథి న్యూస్, చిన్నశంకరంపేట: లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సంక్రాంతి పండుగ పూట ఈ విషాదకర ఘటన బుధవారం సాయంత్రం చిన్నశంకరంపేట గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన నిమ్మతోట ఆంజనేయులు(38) చిన్నశంకరంపేటలో వీక్లీ మార్కెట్ ముగించుకుని ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. చిన్నశంకరంపేట – అంబాజీపేట గ్రామాల సరిహద్దు కల్వర్టుపై మెదక్ నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఎక్సెల్ పై వెళ్తున్న ఆంజనేయులు తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు, పోలీసులు వచ్చేలోపే ప్రాణం విడిచాడు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గౌస్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
- January 13, 2021
- Archive
- క్రైమ్
- AMBAJIPUR
- CHINNASHANKARAMPET
- KONDAPUR
- medak
- ROAD ACCIDENT
- అంబాజీపేట
- కొండాపూర్
- చిన్నశంకరంపేట
- మెదక్
- రోడ్డు ప్రమాదం
- Comments Off on సంక్రాంతి వేళ విషాదం