సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి/ కల్వకుర్తి: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు కు అందజేశారు. ఆయన వెంట మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి వెళ్లి స్వయంగా నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. మరో అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా నామినేషన్ వేశారు. ఆయన వెంట మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ఉన్నారు. ఇదిలాఉండగా, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో ఆద్యంతం ట్విస్ట్ కొనసాగింది. మొదట మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాలకు కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ను ఖరారు చేశారు. అయితే కూచకుళ్ల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా అధినాయకత్వం ఇచ్చిన హామీ మేరకు దామోదర్‌రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. తాజాగా ఆయన నామినేషన్ వేశారు.
- November 23, 2021
- Archive
- Top News
- CM KCR
- MAHABUBNAGAR
- MLC ELECTIONS
- TRS
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- తెలంగాణ
- మహబూబ్‌నగర్
- సీఎం కేసీఆర్
- స్థానిక సంస్థలు
- Comments Off on కూచకుళ్ల, కసిరెడ్డి నామినేషన్