Breaking News

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

సారథి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర  ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవారం పాటు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రజలు సమూహాలుగా ఉండకుండా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. పెళ్లిళ్లకు 100 మందికి మించకుండా, అంత్యక్రియలకు 20 మంది మించరాదని స్పష్టం చేసింది. భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, మతపరమైన, సాంస్కృతిక సమావేశాలు, కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు, ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.

రెండో డోసు వారికి ప్రాధాన్యం

కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకోవాల్సిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు డీహెచ్‌ తెలిపారు. 11 లక్షల మందికిపైగా రెండో డోసు తీసుకోవాల్సి ఉందన్నారు. రెండో డోసు వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. రెండో డోసు పూర్తయిన వారికి కరోనా నుంచి పూర్తి రక్షణ లభిస్తుందన్నారు. రెండో డోసు బుక్‌ చేసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ్టికి రాష్ట్రంలో 3.74 లక్షల టీకాలు అందుబాటులో ఉన్నాయని.. మే 15లోపు మరో 3 లక్షల డోసులు రాష్ట్రానికి వస్తాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ నిల్వలు పెరగగానే 18 ఏళ్లు నిండినవారికి టీకాలు వేస్తామని డీహెచ్‌ స్పష్టం చేశారు.

ప్రతిరోజు సాయంత్రం బులెటిన్‌

తెలంగాణ కరోనా బులెటిన్‌ను ఇకపై ప్రతి రోజూ సాయంత్రం విడుదల చేయనున్నట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 65,375 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు డీహెచ్‌ తెలిపారు. వాటిలో 5,559 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 41 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,87,199కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,061 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,13,225కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71,308 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మందుల కొరత లేదు

జీహెచ్ఎంసీ పరిధిలో పడకల పెంపు కార్యక్రమం కొనసాగుతోందని డీఎంఈ రమేష్‌ రెడ్డి వెల్లడించారు. నిమిషానికి రెండు కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా చేయగల జనరేటర్‌ను గాంధీలో ప్రారంభించినట్లు చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఇవ్వాల్సిన ఆక్సిజన్ ఇవ్వడం లేదన్నారు. 51 ఆక్సిజన్ జనరేటర్‌లు తెలంగాణకు కేటాయించారని.. వాటికి సంబంధించిన పనులు నెల రోజుల్లోగా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వీటిని జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువగా వినియోగించేందుకు అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్‌ టిమ్స్‌లో అదనంగా 200 పడకలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకల సామర్థ్యం సుమారు 15 వేలకు చేరిందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా మందుల కొరతV