Breaking News

నిధుల్లేవ్.. వచ్చి ఏం లాభం!

నిధుల్లేవ్.. వచ్చి ఏం లాభం!
  • ఎంపీటీసీలు రాక జనరల్​ బాడీ సమావేశం వాయిదా

సామాజిక సారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండల సర్వసభ్య సమావేశం గురువారం అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో వాయిదాపడింది. ఈ మేరకు ఎంపీటీసీలకు నిధులు ఏమీ రావడం లేదని, దీంతో హాజరుకావాలని కాలేకపోతున్నామని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ విషయమై పరిధిలోని తిమ్మినోనిపల్లి సర్పంచ్ రామచంద్రారెడ్డి ఎంపీపీ విజయను నిలదీశారు. మండల సర్వసభ్య సమావేశం ఉందని హైదరాబాద్ ​లో ఓ ముఖ్యమైన పని వదులుకొని వచ్చామని, అసలు సభ ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. స్పందించిన ఎంపీపీ విజయ ఎంపీటీసీలు అందరికీ సమాచారం ఇచ్చామని, వారితో నేరుగా ఫోన్లో కూడా మాట్లాడామని తెలిపారు. సమావేశానికి ఎందుకు రాలేదో అర్థం కావడం లేదన్నారు. ఏకగ్రీవమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అన్యాయం జరిగిందని కొందరు ఎంపీటీసీలు పెదవి విరిచినట్లు సమాచారం. మరో రెండు మూడురోజుల్లో సమావేశం తేదీ వెల్లడిస్తామని ఎంపీపీ విజయ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు.