- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
- వైఎస్సార్టీపీలో చేరిన గట్టు రాంచంద్రరావు
సామాజికసారథి, హైదరాబాద్: ‘ఏపీలో పార్టీ పెడుతున్నారా అంటూ మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నకు రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు. ఆంధ్రప్రదేశ్లో పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అక్కడ కూడా పార్టీ పెడతాం’ అంటూ వైఎస్షర్మిల సంచలన వాఖ్యలు చేశారు. సోమవారం వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు ఆవేదన యాత్ర పేరుతో ఈ నెల 19 లేదా 20 నుంచి మరోసారి పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. నిబంధనల ప్రకారం తాము వెళ్తామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. మరోవైపు.. రైతుబంధు, పండుగలకు ఈ నిబంధనలు ఏ మాత్రం అడ్డురావు అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు. కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కెందుకే నిబంధనలు అడ్డువస్తున్నాయని ఆమె ఆరోపించారు. కాగా, టీఆర్ఎస్నాయకుడు గట్టు రాంచంద్రారావు ఆ పార్టీని వీడి వైఎస్సార్టీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ.. దేశానికి నాయకత్వం చేయొచ్చు కానీ తెలంగాణలో పుట్టిన షర్మిలక్క రాష్ట్రానికి నాయకత్వం చేయకూడదా? ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు’ అని అన్నారు.