సందీప్ కిషన్ యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రాజెక్ట్ ‘మైఖేల్’. దీనికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, ఇందులో రొమాన్స్, డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్ దాదాపు ప్రతి పాత్రను డార్క్ వే లో చూపిస్తుంది. గౌతమ్ మీనన్, సందీప్ కిషన్‌ను స్త్రీల గురించి వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రేమలేని జీవితానికి అర్ధం లేదని సందీప్ భావిస్తాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయి దివ్యాంశ కౌశిక్ కూడా తనతో ప్రేమలో పడితే, హార్ట్ బ్రేక్ అవుతుందని హెచ్చరిస్తుంది. సందీప్ కిషన్ ఒకరిని తుపాకీతో కాల్చడంతో ట్రైలర్ ముగుస్తుంది. విజయ్ సేతుపతి వార్నింగ్ ఇస్తూ కనిపించడం ట్రైలర్ కి మరింత సీరియస్‌నెస్‌ని తీసుకొచ్చింది. వరలక్ష్మి శరత్‌కుమార్ యాక్షన్ రోల్లో ఆకట్టుకుంది. ఇందులో వరుణ్ సందేశ్ సాలిడ్ రోల్ కనిపించాడు. అనసూయ భరద్వాజ్ బలమైన పాత్రలో కనిపించింది. ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ రాశారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావుల జాయింట్ ప్రొడక్షన్ వెంచర్. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ట్రైలర్ తో హ్యుజ్ బజ్ పెంచిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
- January 24, 2023
- Archive
- CINEMA GALLERY
- Top News
- సినిమా
- Cinema
- TELANGANA
- Comments Off on మైఖేల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణహీరో