సారథి ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ‘దిశ’ సమీక్ష సమావేశంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు సంచలనం కోసం ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచిందని, ఏ ప్రభుత్వమూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని, ఉద్యోగం అంటేనే ఉపాధి అని, అది కల్పించడం ప్రభుత్వ విధి’ అని మంత్రి అన్నారు. ఈ వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు వక్రీకరించి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నానని ప్రచారం చేయడం పట్ల తాను విచారం వ్యక్తం చేస్తున్నానని మంత్రి తెలిపారు. కొన్ని పత్రికలు, టీవీలు, ప్రసార సాధనాలు సంచలనాల కోసం కాకుండా వాస్తవాలు, వాస్తవంగా ప్రజలకు సాధ్యమయ్యేవి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించడాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
- July 15, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- DISHA
- NAGARKURNOOL
- NIRANJANREDDY
- దిశ
- నాగర్‌కర్నూల్
- మంత్రి నిరంజన్‌రెడ్డి
- Comments Off on నా మాటలను వక్రీకరించారు.. విచారం వ్యక్తంచేస్తున్నా: మంత్రి