సారథి న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులకు ఎన్నో హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చకుండా ఉన్న ప్రజాప్రతినిధులు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆగ్రహంలో కొట్టుకపోకతప్పదని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ నిరుద్యోగుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, ఆర్సీరెడ్డి స్టడీ సెంటర్, పలు స్టడీ సెంటర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలువురు గ్రాడ్యుయేట్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు వెలువడక, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా నియామకాలు చేపట్టకపోవడంతో వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఎవరిని కలిసినా ఆవేశం, కన్నీళ్లే వస్తున్నాయని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయని ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని పట్టభద్రులను కోరారు. తనను గెలిపిస్తే మీ డిమాండ్లను నెరవేరుస్తానని, ప్రజాగొంతుకగా అందరి వాణిని వినిపిస్తానని వారికి హామీ ఇచ్చారు.
- March 7, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- హైదరాబాద్
- HYDERABAD
- MLC ELECTIONS
- TELANGANA
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- తెలంగాణ
- మహబూబ్నగర్
- ముకురాల శ్రీహరి
- హైదరాబాద్
- Comments Off on నిరుద్యోగుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు