Breaking News

దామోదర్ రెడ్డికే జై!

దామోదర్ రెడ్డికే జై!

  • స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో ట్విస్ట్
  • మహబూబ్​నగర్ ​నుంచి సిట్టింగ్ ​ఎమ్మెల్సీ కూచకుళ్లకు టికెట్​ ఖరారు
  • ఓకే చేసిన టీఆర్ఎస్​ అధిష్టానం.. రేపు నామినేషన్​ వేసే అవకాశం

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: సీనియర్ ​నేత, సిట్టింగ్​ ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డి వైపే టీఆర్ఎస్​ అధిష్టానం మొగ్గుచూపింది. ఆయన అభ్యర్థిత్వాన్ని అడ్డుకోవాలని సొంత పార్టీలోనే కొందరు ప్రయత్నించినా తిరిగి కూచకుళ్లకే మహబూబ్​నగర్ ​జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం బీ ఫామ్ ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్సీలకు మళ్లీ అవకాశం దక్కినట్లయింది. ఆదివారం రాత్రి ప్రకటించిన జాబితాలో కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రముఖ గాయకుడు సాయిచంద్​ పేర్లు ఉన్నాయి. దీంతో సిట్టింగ్​ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరవర్గం తీవ్ర ఆందోళనకు గురైంది. ఆయనకు నియోజకవర్గంలో 30వేలకు పైగా ఓటు బ్యాంకు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్​కర్నూల్​ ఎమ్మెల్సీ మర్రి జనార్ధన్​రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకోవడంలో కీలకపాత్ర పోషించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటానని కూచకుళ్ల అధిష్టానం ముందు తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం తన నిర్ణయాన్ని అనూహ్యంగా మార్చుకున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి టి.హరీశ్​రావు కూచకుళ్ల దామోదర్​రెడ్డితో చర్చలు జరిపించినట్లు విశ్వసనీయ సమాచారం. నాగర్​కర్నూల్ ​నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని భావించిన అధినాయకత్వం మళ్లీ ఆయనకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో కూచకుళ్ల దామోదర్​రెడ్డి మంగళవారం నామినేషన్ ​వేసే అవకాశాలు ఉన్నాయి.

హామీ ఇచ్చాకే’ టీఆర్ఎస్​లోకి..
ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా నుంచి టీఆర్ఎస్​ పార్టీ నుంచి గత ఎన్నికలో సిట్టింగ్​ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు. మరో స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్​ను వీడి టీఆర్ఎస్​ గూటికి చేరారు. జాయిన్ చేసుకునే క్రమంలో మళ్లీ ఎమ్మెల్సీ టిక్కెట్ తనకే ఇస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​రావు ఇద్దరు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మరోసారి కూచకుళ్ల దామోదర్​రెడ్డికి టికెట్ ​ఖరారు చేసినట్లు తెలిసింది.