Breaking News

కొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఫలితం

కొద్ది గంటల్లో ఎమ్మెల్సీ ఫలితం

హైదరాబాద్​: హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం స్థానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. అభ్యర్థులు ఎవరూ కూడా మేజిక్ ఫిగర్ దాటకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. నల్లగొండ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,10,840 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరాంకు 70,072 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 39,107 ఓట్లు వచ్చాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఏడు రౌండ్లలో 3,87,969 ఓట్లను లెక్కించారు. ఇందులో 3,66,333 ఓట్లు చెల్లుబాటు కాగా, 21,636 ఓట్లు చెల్లకుండాపోయాయి.
సెకండ్​ ప్రయారిటీ ఓట్లే కీలకం
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరు కూడా మేజిక్ ఫిగర్‌ 1,83,167 ఓట్లను చేరుకోలేకపోయారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను శుక్రవారం ఉదయం నుంచి లెక్కిస్తున్నారు. 56 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ కాగా, మరో 16 మంది బరిలోనే ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,11,255, తీన్మార్ మల్లన్న 83,677, కోదండరాం 70,533, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాములునాయక్, జయసారథిరెడ్డి, చెరుకు సుధాకర్, రాణిరుద్రమ, బరిగెల దుర్గాప్రసాద్, షేక్ షబ్బీర్ అలీ, సుదగాని హరిశంకర్ గౌడ్, కర్నె రవి, జి.వెంకటనారాయణ, తాళ్లూరి సృజన్ కుమార్, డి.వేలాద్రి, భారతి కురాకుల రేసులోనే ఉన్నారు.
హైదరాబాద్​ ఎమ్మెల్సీ.. 59 మంది ఔట్​
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ స్థానంలో 3.58,348 ఓట్లు పోల్ కాగా, 3,37,039 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 21,309 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఇదిలాఉండగా, వేల సంఖ్యలో ఓట్లు చెల్లుబాటు కాకపోవడంతో పట్టభద్రులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటివరకూ 59 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఎలిమినేషన్​అభ్యర్థుల 1,311 ఓట్లలో బీజేపీకి 343, టీఆర్ఎస్ కు 386, ప్రొఫెసర్ నాగేశ్వర్​కు 234, కాంగ్రెస్​కు 174 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల కేటాయింపు తర్వాత కూడా టీఆర్ఎస్​అభ్యర్థి వాణీదేవి 1,13,076 ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్​రావు 1,05,011 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 53,844 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డికి 31,728 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.