సామాజిక సారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడం కోసం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే ఆయన గతంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ హామీ మేరకు బంగారాన్ని ఆలయానికి అప్పగించారు. శుక్రవారం కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని జనార్దన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆలయ ఈవో ఎన్.గీత తదితరులు పాల్గొన్నారు.
- November 27, 2021
- Archive
- Top News
- నల్లగొండ
- లోకల్ న్యూస్
- GIFT
- GOLD
- Janardhan Reddy
- MARRI
- MLA
- YADADRI
- ఎమ్మెల్యే
- కానుక
- జనార్ధన్ రెడ్డి
- బంగారు
- మర్రి
- యాదాద్రి
- Comments Off on యాదాద్రికి ఎమ్మెల్యే మర్రి బంగారు కానుక