Breaking News

మేడారం జాతరపై మంత్రి సమీక్ష

మేడారం జాతరపై మంత్రి సమీక్ష

 సామాజిక సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ స్థానిక అధికారులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకూ జరగనున్న జాతర కోసం వసతుల కల్పన, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు అందించారు. ముందుగా మేడారం అమ్మవార్లు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కావల్సిన స్నానఘట్టాలు, దుస్తుల మార్పిడి గదులు, ప్రమాదాలు సంభవించకుండా తీసుకుంటున్న చర్యలు, భక్తుల వసతి సౌకర్యాలపై మేడారం ప్రాంతమంతా పర్యవేక్షించారు. అనంతరం  జరుగుతున్న పనులు, చేయాల్సిన పనులపై స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, నేతలతో సమీక్ష ప్రారంభించారు. ఆమె వెంట ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు ఉన్నారు.