సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తన తనయుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావును హైదరాబాద్ లో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన దామోదర్ రెడ్డికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విజయం కోసం పనిచేసిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల కృషిని కొనియాడారు. వారికి అభినందనలు తెలియజేశారు.
- November 26, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HARISHRAO
- MAHABUBNAGAR
- MLC
- TRS
- ఎమ్మెల్సీ
- దామోదర్ రెడ్డి
- మహబూబ్‌నగర్
- Comments Off on ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి విషెస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు