Breaking News

కూచకుళ్ల, కసిరెడ్డికి మంత్రి కేటీఆర్ అభినందనలు

కూచకుళ్ల, కసిరెడ్డికి మంత్రి కేటీఆర్ అభినందనలు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్​ ప్రతినిధి: మహబూబ్​నగర్​ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​తో కలిసి గురువారం సాయంత్రం టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావును హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో మంత్రులు వారికి బొకే అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఇద్దరు సిట్టింగ్ ​ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లా ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీలు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధుల కృషిని మంత్రులు ప్రశంసించారు. మంత్రి కేటీఆర్​ను కలిసిన వారిలో కూచకుళ్ల దామోదర్​రెడ్డి కుమారుడు, యువనేత డాక్టర్​ కూచకుళ్ల ​రాజేశ్​రెడ్డి ఉన్నారు.