సారథి, తాడ్వాయి: కరోనా సమయంలో వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 30 మంది ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలను శాలువాతో ఘనంగా సన్మానించి చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్ తమనే అంతం చేస్తుందని తెలిసి కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని కొనియాడారు. ఇలాంటి సమయంలో సేవలు అందిస్తున్న ఆశావర్కర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైద్యసిబ్బందిని శాలువాలతో సన్మానించారు. అనంతరం తాడ్వాయి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి భోజనం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, మండలాధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ బోల్లు దేవేందర్, సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, స్థానిక సర్పంచ్, ఈర్ప సునీల్, మాజీ సహకార సంఘం చైర్మన్ పాక సాంబయ్య, అర్రెం లచ్చుపటేల్, తిరుపతి పాల్గొన్నారు.
- May 29, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- MLA SITHAKKA
- MULUGU
- TADWAI
- ఎమ్మెల్యే సీతక్క
- కరోనా
- తాడ్వాయి
- ములుగు
- Comments Off on వైద్యసిబ్బంది సేవలు భేష్: ఎమ్మెల్యే సీతక్క