![మామిడి తోటకు పెళ్లి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/04/cpd44.jpg?fit=655%2C320&ssl=1)
సారథి, రామడుగు: తొలిసారి కాపుకు వచ్చిన మామిడి తోటకు పెళ్లి జరిపించారు. రైతులు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కడారి వీరయ్య తన సొంత వ్యవసాయ పొలంలో మూడెకరాల విస్తీర్ణంలో మామిడి తోట సాగుచేశారు. మొదటి సారి కోత దశకు వచ్చిన మామిడి తోటకు పెళ్లి చేశారు. గురువారం పురోహితుడు రామస్వామి పంతులు సమక్షంలో శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛరణ మధ్య కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ తంతు నిర్వహించారు.