సామాజిక సారధి , బిజినేపల్లి :నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తాను మర్రి చెట్టు లాగా చెప్పుకొని నీడనిస్తానని చిలుక పలుకులు పలుకుతున్న మరి ఊడలకు చెదలు పట్టి మర్రిచెట్టు కూలిపోవడానికి అతి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొడీ దల రాము అన్నారు . మంగళవారం బిజినపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు . దళిత , గిరిజన ఆత్మగౌరవ సభను చూసి నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్ రెడ్డి ఓటమిపాలు అవుతారని తెలిసే రేవంత్ రెడ్డి పైన అసత్యపు ఆరోపణలు చేస్తూ వంగెంగ మాట్లాడుతున్నారని అన్నారు . మీ అగ్రవర్ణ కార్యకర్తలతో దళిత గిరిజనులను కాలు కింద వేసి తొక్కి , మళ్లీ అదే దళిత గిరిజనులపై కేసును నమోదు చేపించిన ఘనత మీదేనని అన్నారు . ఓ పక్క అంబేద్కర్ పేరు చెప్పి దళిత గిరిజనులకు నీవే అండ అని మాయ మాటలు చెప్పితే ఇక్కడి ప్రజలు నిన్ను నమ్మే స్థితిలో లేరని అది గుర్తు చేసుకోవాలని తెలిపారు . దళిత గిరిజనులపై దాడులు చేసిన వారి పైన నేటికీ చర్యలు తీసుకోకపోవడం పై మీ ప్రమేయం ఎంత ఉందో ఇక్కడి ప్రజలకు తెలుసునని , మీ పార్టీలో ఉన్న దళిత గిరిజన సోదరులకు కూడా మీ వ్యక్తిత్వం అందరికీ అర్థమయిపోయిందని అన్నారు . కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని దళిత చట్టాలను కాలరాస్తున్న నీకు ఇక్కడి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారని అన్నారు . పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఇక మీరు గ్రామాల్లో తిరగరని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు . సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి , ఈశ్వర్ , పాషా , సూరి , తదితరులు ఉన్నారు .
- January 24, 2023
- Archive
- Top News
- తెలంగాణ
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on మర్రి ఊడలకు చెదలు పట్టక తప్పదు…. సభలు చూసి ఓటమి తప్పదనుకుంటున్న మర్రి