•రాజకీయ కుట్రతోనే వైద్యుని బదిలీ
సామాజిక సారథి, రామకృష్ణాపూర్: గత కొన్ని సంవత్సరాలుగా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో మెడికల్ సూపర్డెంట్ వైద్యునిగా ఓ పక్క కార్మికులకు కార్మిక కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందిస్తూ..మరో పక్క సోదరి జ్ఞాపకార్థంగా జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులకు,నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాలు చేస్తూ అతి తక్కువ సమయంలో చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజల్లో తనదైన ముద్ర వేసి స్థిర స్థాయిగా నిలిచారు.ఇటీవల 2022 నవంబర్ 27 తేదీన పట్టణంలోని స్థానిక ఠాగూర్ స్టేడియంలో జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడీ పూజ మహోత్సవాన్ని ఐదువేల మందితో అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమానికి హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఖమ్మం మాజీ ఏం.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇంకొందరు హాజరయ్యారు.ఇవ్వన్నీ గమనిస్తూ అప్పటి నుంచి గోడిసెల సురేఖ రాజ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవ కార్యక్రమాలను చూసి ఓర్వలేక అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు కావాలనే పని కట్టుకొని ఈ మధ్య కాలంలో నియోజకవర్గ ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఏకంగా ఆసుపత్రి నుంచి వైద్యున్ని బదిలీ చెయ్యాలనే ఓకే నిర్ణయంతో ఏకంగా బదిలీ చేశారు. ఈ బదిలీపై ఇతర పార్టీలకు చెందిన నాయకులు,కార్మిక యూనియన్ సంఘాల నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, రాజకీయ కుట్రతోనే వైద్యుని బదిలీ చేసారని ఆరోపిస్తున్నారు.
అక్రమ బదిలీని ఆపివేయాలి
ఏరియా ఆసుపత్రి వైద్యున్ని ఇటీవల ఇల్లందుకు బదిలీ చేయడాన్ని రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన బిజెపి,కాంగ్రెస్, ఏఐటీయూసీ,ఐఎన్టియుసి కార్మిక యూనియన్ సంఘాల నాయకులతో పాటు
పలు స్వచ్ఛంద సంస్థలు బగ్గుమన్నాయి. డాక్టర్ రాజా రమేష్ బాబు అక్రమ బదిలీని ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆర్కేపి ఏరియా ఆసుపత్రి ముందు నల్ల బ్యాడ్జీలను ధరించి, ఫ్లకార్డ్స్ లతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గతంలో ఆసుపత్రిలో తప్పు చేసిన ఓ వ్యక్తిని అధికార పార్టీకి చెందిన అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు రక్షిస్తూ తిరిగి ఇదే ఆసుపత్రిలో విధులు నిర్వహించేలా అతనికి తోడ్పాటు అందించారు. మరి ఎలాంటి తప్పు చేయని వైద్యున్ని ఆసుపత్రి నుంచి ఇల్లందుకు బదిలీ చేయడాన్ని అధికార పార్టీ టి(భీ)ఆర్ఎస్ పని గానే భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వైద్యుని బదిలీని ఆపివేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రానున్న రోజుల్లో వైద్యునికి మద్దతుగా అనేక నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఏం.డి అక్బర్ అలీ, ఐఎన్టియుసి బ్రాంచ్ సెక్రెటరీ తేజావత్ రాంబాబు,
మానవత వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పొన్నాల సాగర్, నాయకులు మల్లయ్య,ప్రసాద్,పాల రాజయ్య,పట్టణ యూత్ తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజుకు చేరిన నిరసన
ఆసుపత్రి వైద్యుని బదిలీపై బిజెపి పార్టీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు మద్దతుగా నిలిచారు.సోమవారం పట్టణంలోని వర్తక వ్యాపార సముదాయల బంధుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులు ఆయన బదిలీని నిలిపివేయాలంటూ బందు పాటించారు. బదిలీని నిలిపివేయకుంటే కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.