సామాజిక సారథి, రామకృష్ణాపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భీ.రాహుల్, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ సూచించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు తారకరామా కాలనీ డివినిటి పాఠశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ చేతుల మీదుగా క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి చూపు సమస్యలను పరిష్కరించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటనారాయణ, వైస్ చైర్మన్ విద్యాసాగర్, వైద్యురాలు మానస, క్యాంపు మెడికల్ ఆఫీసర్ శ్యామల పాటిల్, మేనేజర్ నాగరాజు, ఆర్ఐ కృష్ణప్రసాద్, వసంత్, ప్రదీప్ కుమార్, శ్రీధర్, పూర్ణచందర్ పాల్గొన్నారు.
- January 20, 2023
- Archive
- Top News
- తెలంగాణ
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- లోకల్ న్యూస్
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి