సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి నుంచి శబరిమలకు మహా పాదయాత్రలో భాగంగా ఆదివారం నెల రోజులు పూర్తయింది. గత నెల 6వ తేదీన కొక్కొండ శ్రీశైలం, సాహితి రాము గురుస్వాముల ఆధ్వర్యంలో సంగారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. తమిళనాడు రాష్టం నమక్కల్ వరకు 850 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసినట్లు శ్రీశైలం, రాము గురుస్వాములు తెలిపారు. ఈ నెల 15వ తేదీన శబరిమల ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, విశ్వనాథ్ రావు, వెంకన్న, మానిక్ రెడ్డి, మల్లేశం, పరమేశ్వర్ గౌడ్, ప్రభు గౌడ్, నరేష్ కుమార్, బబ్ల్యూ, వెంకట్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.
- December 6, 2021
- Archive
- Top News
- ఆధ్యాత్మికం
- లోకల్ న్యూస్
- Comments Off on తమిళనాడుకు చేరుకున్న మహాపాదయాత్ర