Breaking News

వైభవంగా మహా మండల పూజ

వైభవంగా మహా మండల పూజ

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలంలోని కొట్ర గ్రామంలో ఆంజనేయ ఆలయం పున:ప్రతిష్టాపన సందర్భంగా భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం మహా మండల పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పుణ్యహవచనం, అభిషేకం, గణపతి నవగ్రహ మన్య సూక్తహోమం భక్తాంజనేయ స్వామి సహస్ర నామావళి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమాలు జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. గ్రామస్తులు సర్పంచ్​ పొనుగోటి వెంకటేశ్వరరావు, రుక్మిణి దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ పొనుగోటి భాస్కర్ రావు, ఎంపీటీసీ రాములు, వార్డు సభ్యుడు పి.విష్ణువర్ధన్ రావు, భూపతిరావు, కిషన్​రావు, శేఖర్ రావు, శ్రీనివాసరావు, వెంకోజీ, గోపాల్ రావు, పి.కర్ణాకర్​రావు, సుధాకర్ రావు, పురుషోత్తంరావు, కృష్ణారావు, యుగంధర్ రావు, కర్ణాకర్ గౌడ్, ఆకారం నాగరాజు, జూలూరి రమేష్, నాయకులు రామచంద్రయ్య, కడారి కృష్ణయ్య, జంగయ్య యాదవ్, సత్యనారాయణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పూజలో పాల్గొన్న భక్తులు, గ్రామస్తులు
సర్పంచ్​ పొనుగోటి వెంకటేశ్వర్​ రావు దంపతులకు సన్మానం