- దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: గణపతి చక్కెర పరిశ్రమ యాజమాన్యం కార్మికుల మధ్య చిచ్చుపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే, పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షుడు రఘునందన్ రావు అన్నారు. నూతన వేతన సవరణ కోసం గణపతి పరిశ్రమ రెగ్యులర్ ఉద్యోగులు గత 23 రోజులుగా పరిశ్రమ ఎదుట సమ్మె నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే, చెరుకు క్రషింగ్ ప్రారంభం అయ్యే సమయం దగ్గర పడటంతో సీజనల్ కార్మికులు తక్షణమే విధుల్లో చేరాలంటూ యాజమాన్యం పరిశ్రమలోని నోటీసు బోర్డు పై గురువారం నోటీసును అతికించింది. ఎమ్మెల్యే, కార్మిక సంఘం అధ్యక్షుడు రఘునందన్ రావు సమ్మె శిబిరాన్ని సందర్శించి కార్మికులకు భరోసా ఇచ్చి మట్లాడారు. యాజమాన్యం కార్మికుల న్యాయమైన డిమాండ్ లను వెంటనే పరిష్కరించి క్రషింగ్ ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.