Breaking News

ప్రధాని మోడీకి ఉత్తరం రాసిన: ఎమ్మెల్యే  

ప్రధాని మోడీకి ఉత్తరం రాసిన: ఎమ్మెల్యే

సామాజిక సారథి, నకిరేకల్: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉత్తరం రాశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నేడు సిరిపురం చేనేత సహకార సంఘం సభ్యులు, నాయకుల ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుని రాశారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఉత్తరంలో పేర్కొన్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో యావత్ భారత జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైన పన్ను వేసిన తొలి ప్రధాని మోడీనేనని విమర్శించారు. గాంధీ మహాత్ముడే ఆదర్శమనే బిజెపి ప్రభుత్వం, విధానాల్లో మాత్రం వాటిని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. దేశంలో రెండో అతిపెద్ద రంగమైన చేనేతపై వెంటనే పన్నును రద్దు చేయలన్నారు.