Breaking News

ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ఆపబోం..

ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ఆపబోం..

సారథి, రామాయంపేట: కరోనాతో రాష్ట్ర ఆదాయం దెబ్బతిన్నప్పటికి కూడా ఏ పథకాలను ఆపకుండా, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పండించిన పంటను నేరుగా కొనుగోలు సెంటర్లలోనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు. ధాన్యం అమ్మిన మూడు నాలుగు రోజుల్లోనే వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయని తెలిపారు.
సీఎం కేసీఆర్​ త్వరగా కోలుకోవాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని చల్మేడ గ్రామ శివారులో ఉన్న గాయత్రీ మాత ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నిజాంపేట ఎంపీపీ, ఐకేపీ సీసీ మల్లేశం, రామయంపేట కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బిజ్జ సంపత్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు అమర్​సేనారెడ్డి పాల్గొన్నారు.