సామాజిక సారథి, నిడమనూరు: నిడమనూరు పరిధిలోని వేంపాడు సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ఇటీవల గండి పడింది. దీంతో అప్రమత్తమైన సంబంధి ఉన్నతాధికారులు గండి పూడ్చారు. అదే ప్రదేశంలో శనివారం సాయంత్రం కట్టకు అతి తక్కువ మోతాదులో నీటి లీకేజీ ప్రారంభమైనట్లు గ్రామస్తులు తెలిపారు. కెనాల్ లో పూర్తిస్థాయిలో నీరు ప్రవహిస్తున్నందున గండి పూడ్చిన ప్రదేశాల్లో నీటి లీకేజీలు సహజంగా ఉంటాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని రైతులు, స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి లీకేజీలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పరిసర గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు. స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందొద్దని అధికారులు చెప్పుతున్నారు.
- October 30, 2022
- Archive
- Top News
- నల్లగొండ
- లోకల్ న్యూస్
- CANAL
- Leakage
- Left
- NAGARJUNASAGAR
- Nidamanur
- Vempadu
- Comments Off on మళ్లీ మొదలైన లీకేజ్..!?