సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్ని ధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చకబృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాలపూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. పాంచ రాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు గంటకు పైగా లక్షపుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి. విశేష వేడుకులను యాదాద్రి అర్చక బృందం నిర్వహించగా సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
- December 15, 2021
- Archive
- Top News
- ఆధ్యాత్మికం
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- పుష్పార్చన
- యాదాద్రి
- లక్ష
- Comments Off on యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన