Breaking News

నాసిరక పనులతో కారుకొండకు ప్రమాదమే

… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
సామాజిక సారధి , బిజినేపల్లి: పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్టు కింద జరుగుతున్న కారకొండ కట్ట నిర్మాణ పనులలో నాసిరక పనులతో కారుకొండ గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు . మంగళవారం మండల పరిధిలోని కారుకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా కారకొండ గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేశారు . ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కాలువలను అక్కడక్కడ మిగిలిపోయిన పనులను చేసి తామే చేసినట్లు చెప్పుకుంటున్న బిఆర్ఎస్ నేతలకు సిగ్గు లేదని అన్నారు . నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేకు , జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు కమిషన్ల పై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని అన్నారు . అమాయక ప్రజల భూములను లాక్కొని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటి వరకు నెరవేర్చకుండా వారిని మోసం చేశారని అన్నారు . గత ఏడాది కురిసిన చిన్నపాటి వర్షానికి కట్ట నిర్మాణం లో పెద్ద గోతులు పడ్డాయని , రేపు కట్టనిర్మానం పూర్తయి నీటిని నింపితే ఈ కారుకొండ గ్రామ ప్రజలకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని వాటిని వెంటనే అధికారులు గుర్తించాలని తెలిపారు . ఇక్కడి నాయకులకు నల్ల మట్టి మీద ఉన్న ప్రేమ కారుకొండ ప్రజల పైన లేదని ఇలాంటి వారికి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు . అందుకే ప్రజల సంక్షేమం కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రతి ఒక్కరు గ్రామాల్లో దౌర్జన్య కాండకు పురుడు పోసుకున్న టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని వారు కోరారు . వారి వెంట డిసిసి జిల్లా అధికార ప్రతినిధి అర్థం రవి , యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోడిదల రాము , కాంగ్రెస్ పార్టీ నాయకులు సల్కరిపేట ఎంపీటీసీ అంజి , కాంగ్రెస్ నాయకులు పాష , కాకుండా మాజీ సర్పంచ్ బాలరాజ్ , నిరంజన్ రావు , గోపాల్ రెడ్డి , ఈశ్వర్ , తదితరులు ఉన్నారు .