Breaking News

జైలు నుంచి జర్నలిస్ట్ రఘు విడుదల

జైలు నుంచి జర్నలిస్ట్ రఘు విడుదల

సారథి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల వ్యవహారంలో రెచ్చగొట్టే కథనాలను ప్రసారం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయి జైలులో ఉన్న తొలి వెలుగు జర్నలిస్టు రఘు 13 రోజుల తర్వాత మంగళవారం నల్లగొండ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈనెల 3న మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి వెళ్లిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్న వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ తదితరులు పెద్దఎత్తున జైలు వద్దకు చేరుకొని రఘుకు ఘనస్వాగతం పలికారు. జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి కనీసం కుటుంబసభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లడం సరికాదన్నారు. అన్యాయంగా అక్రమంగా రఘును అరెస్ట్ చేసి మానవ హక్కులకు విఘాతం కల్పించారని వారు అన్నారు.