హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ షర్మిల వెంట నడవనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆమె లోటస్పాండ్లో వైఎస్ షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాను పార్టీకి ఎంతో సేవ చేసినప్పటికీ తనకు సముచితస్థానం కల్పించలేదన్నారు. రాజన్న రాజ్యం కోసం తాను షర్మిల వెంట నడవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు, పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగానే పార్టీ వీడినట్టు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. రాజన్న అమలుచేసిన సంక్షేమ పథకాలతోనే రాష్ట్రం స్వర్ణయుగంలో సాగిందన్నారు. బీజేపీ మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తుందన్నారు. సర్జికల్ స్ట్రైక్ పేరుతో జనాల్లోకి వెళుతున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీ గ్రూపు గొడవలతోనే సరిపెట్టుకుంటుందని విమర్శించారు.
- March 3, 2021
- Archive
- Top News
- పొలిటికల్
- CONGRESS
- INDIARASHOBAN
- LOTUSPAND
- YS SHARMILA
- YSRCP
- ఇందిరాశోభన్
- కాంగ్రెస్ పార్టీ
- లోటస్పాండ్
- వైఎస్ షర్మిల
- Comments Off on షర్మిల చెంతకు ఇందిరాశోభన్