సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం సుధాకర్ రెడ్డి తనను చాంబర్లో కలిసి నామినేషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు రాతపూర్వకంగా లేఖ అందజేశారని కలెక్టర్ వెల్లడించారు. దీంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలారు. పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డితో పాటు ఫరూక్ నగర్ మండలానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి కావలి శ్రీశైలం ఉండనున్నారు. కాగా, ఈనెల 26వ తేదీ వరకు ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మిగిలిన ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఒకవేళ పోటీ నుంచి తప్పుకున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే అవుతుంది. ఏం జరుగుతుందో మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- November 24, 2021
- Archive
- Top News
- పొలిటికల్
- damodharreddy
- KASIREDDY
- MLC
- TRS
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- కసిరెడ్డి
- కూచకుళ్ల
- మహబూబ్‌నగర్
- Comments Off on స్వతంత్ర అభ్యర్థి డ్రాప్.. మిగిలింది ముగ్గురే!