Breaking News

దిలీప్.. నీ స్థాయి మరిచిపోకు!​

దిలీప్.. నీ స్థాయి తెలుసుకో

  • కల్తీమద్యంతో ప్రజల ప్రాణాలు తీసినవ్​
  • ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరూపిస్తే నీ వెంట ఉంటాం
  • ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్​ మంగి విజయ్

సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: ప్రజలకు అండగా నిలుస్తూ పనిచేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై.. బీజేపీ నాగర్​కర్నూల్​అసెంబ్లీ ఇన్​చార్జ్​ దిలీప్ ​ఆచారి స్థాయికి మించి వ్యక్తిగత దూషణలు చేయడం తగదని ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్​ మంగి విజయ్, టీఆర్ఎస్​ నేత మంగి విజయ్​ హెచ్చరించారు. నీ గత చరిత్ర ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన దళితసంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘పాలెం, బిజినేపల్లిలో లిక్కర్, కోడిపందాలు,‌ పులి జూదం ఆడిన చరిత్ర నీది. కల్తీమద్యంతో ప్రజల ప్రాణాలు తీశావ్. పోలీస్ట్ ​స్టేషన్‌లో నీ చరిత్ర బయటపెట్టు. పాలమూరు ప్రాజెక్టు జిల్లా ప్రజల కలల సౌధం. దాని నిర్మాణానికి నల్లమట్టి అవసరం. చట్టప్రకారం రాయల్టీ చెల్లించి పనులు చేసుకుంటున్నారు. బండ్లు ఆపి ఎందుకు వదిలిపెట్టావ్. నీవెన్ని డబ్బులు తీసుకున్నావ్. తెలంగాణ ఉద్యమాలు చేసి కేసుల పాలయ్యాం. బీజేపీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి ఎమ్మెల్యేపై రాద్ధాంతం చేస్తే సహించబోం. ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరూపిస్తే నీ వెంట ఉంటాం.. ఎమ్మెల్యే బలం ప్రజలు, కార్యకర్తలే. ఎమ్మెల్యే కనుసైగ చేస్తే హైదరాబాద్​లో నీ ఇంట్లో తిరగలేవు. ఎమ్మెల్యే మర్రిలా ఎవరూ ప్రజాసేవ చేస్తలేరు. పోస్టర్ అతికించి చూపించు. ఎమ్మెల్యేను కించపరిచిన దిలీపాచారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. దళిత సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తాం”అని మంగి విజయ్ ​హెచ్చరించారు.

రాజకీయ భవిష్యత్​ లేకుండా చేస్తాం
అనంతరం జెట్టి ధర్మరాజు మాట్లాడుతూ.. క్రిమినల్‌ చరిత్ర ఉన్ననీవు టిక్కెట్ కోసం ఎమ్మెల్యేపై ఆరోపణలు సరికాదని బీజేపీ నాగర్​కర్నూల్​అసెంబ్లీ ఇన్​చార్జ్ ​దిలీప్​ ఆచారిని ఉద్దేశించి అన్నారు. నల్లమట్టి లేకుంటే ప్రాజెక్ట్ ఎలా కడతారని ప్రశ్నించారు. రైతుకాని నీకు ప్రాజెక్టు విలువ ఎలా తెలుస్తుందని నిలదీశారు. బొట్టు పెట్టుకోకుంటే ఎస్సీలను కొట్టించావని గుర్తుచేశారు. రాజకీయ భవిష్యత్​లేకుండా చేస్తామని హెచ్చరించారు. కూలీ‌పని చేసి ప్రజాసేవకుడిగా మరారని అన్నారు. నీవు ఏ పనిచేశావో, ఏ ఉద్యమం చేశావో చెప్పాలని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై హత్యాచారాలు జరుగుతున్నా స్పందించడం లేదన్నారు. కల్తీసారాతో ప్రాణాలు తీశావని మండిపడ్డారు. ఎమ్మెల్యే మెడికల్ కాలేజీ తెచ్చి ప్రాణాలు కాపాడుతున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే శాంతియుతంగా ఉండాలని కోరుతున్నామని అన్నారు. సమావేశంలో పలువురు టీఆర్ఎస్​నాయకులు పాల్గొన్నారు.