Breaking News

ఈ జర్నీ ని చాలా ఎంజాయ్ చేశాను
సందీప్ కిషన్

హీరో సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ‘మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపధ్యంలో సందీప్ కిషన్ తో చిత్ర విశేషాలు..
ఈ కథకి, విజువల్ నెరేటివ్ కి, సినిమాకి పాన్ ఇండియా కెపాసిటీ వుంది. యాక్షన్ చాలా ఫ్రెష్ గా, చాలా రియలిస్టిక్ వైబ్ తో వుంటుంది. మైఖేల్ కి ఫ్రండ్స్ వుండరు. ఎవరితో మాట్లాడడు. తను చేసే పనులన్నీ చాలా ఎక్సయిటింగా వుంటాయి. ఇలాంటి పాత్రలు ఎప్పుడూ చేయలేదు. ఇది చాలా యూనిక్ స్టొరీ. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ చాలా బలంగా వుంటాయి. బ్యాడ్ గయ్స్. బ్యాడ్ పీపుల్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. డార్క్ కామెడీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచన నాదే. విజయ్ సేతుపతి గారి పాత్ర సినిమాని ఇరవై నిమిషాలు పాటు మోసుకెళుతుంది. గౌతమ్ మీనన్ పాత్ర చాలా ఫ్రెష్ గా వుంటుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, విజయ్ సేతుపతి కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా వుంటుంది. అలాగే వరుణ్ సందేశ్ కూడా ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. దివ్యాంశ కౌశిక్ పాత్ర కూడా ట్రిక్కీగా వుంటుంది. ఈ కథలో మైఖేల్ పాత్రని కొట్టి ఐదు రోజులు పాటు తిండి తిప్పలు లేకుండా ఒకచోట పారేస్తారు. ఆ సీన్ చేస్తున్నపుడు నిజంగానే వాటర్ తప్పితే ఏమీ తీసుకోలేదు. దాదాపు 18 రోజులు పాటు ఆ డైట్ లో వున్నాను. దీంతో పాటు షూటింగ్ కూడా చాలా డార్క్ ఏరియాల్లో చేశాం. చాలా రోజుల తర్వాత నాతో చాలా పని చేయించుకున్న సినిమా ఇది. చాలా వర్క్ సాటిస్ఫాక్షన్ వుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. ఈ జర్నీ ని చాలా ఎంజాయ్ చేశాను. బరువు తగ్గాను, స్కూబా డ్రైవింగ్ నేర్చుకున్నాను, అండర్ వాటర్ లో షూట్ చేశాం. ఇది చాలా స్పెషల్ జర్నీ. భరత్, మోహన్, సునీల్ గారు వండర్ ఫుల్ నిర్మాతలు. ఎక్కడా రాజీపడలేదు. భైరవ కోన, బడ్డీ, కెప్టన్ మిల్లర్ సినిమాలు చేస్తున్నా. ఈ మూడు భిన్నమైన సినిమాలు. దీనితో పాటు ఫ్యామిలీ మ్యాన్ 3 వుంది. అలాగే త్వరలోనె మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాబోతుంది.