అద్భుతమైన నటన, డాన్స్‌తో గ్లామరస్పాత్రలో ఒదిగిపోయే మిల్కీ బ్యూటీ తమన్నా రూటు మార్చే ప్రయత్నంలో ఉందట. తెరపై గ్లామర్ డోస్‌కు గుడ్‌బై చెప్పి.. కాస్త డిఫరెంట్ రోల్ చేయాలని నిర్ణయం తీసుకుందని టాక్. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల పోటీని తట్టుకొని తెరపై నిలబడాలంటే ఈ తరహాలు సినిమాలు చేయడమే బెటరని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తమన్నా ‘ఆహా’లో రూపొందిన ‘లెవన్త్ అవర్’ అనే వెబ్‌సిరీస్‌తో మంచి మార్కులు కొట్టేసింది.
త్వరలో ‘హాట్‌స్టార్’లో వచ్చే ‘నవంబర్ స్టోరీ’తో పాటు ఇతర ఓటీటీలతో మరో రెండు వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తోంది సినీవర్గాల టాక్. కొంతకాలం గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండి క్రైమ్, హార్రర్ థ్రిల్లర్లు, సన్సెస్ లాంటి సినిమాల్లో నటించాలని ఆమె డిసైడ్అయిందట. అందులోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని తమన్నా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమే అయితే తమన్నా గ్లామర్ కోసం థియేటర్లకు వెళ్లే కుర్రకారుకు నిరాశ ఎదురుకాక తప్పదు.