హైదరాబాద్: నల్లగొండ, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవి ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ శ్రేణుల సంబరాల్లో భాగంగా బాణాసంచా కాల్చడంతో తెలంగాణ భవన్ కప్పుకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం టీఆర్ఎస్ నేత ఒకరు తుపాకీతో హల్చల్ సృష్టించాడు. ఆ పార్టీలో యూత్వింగ్ లీడర్ కట్టెల శ్రీనివాస్ ఒక్కసారిగా తుపాకీ తీసి పైకి ఎత్తిపట్టడంతో సమీపంలోని కార్యకర్తలు, నాయకులు హతాశులయ్యారు. వెంటనే తుపాకీని దాచిపెట్టాడు. ఈ పరిణామంతో తెలంగాణ భవన్ వద్ద నిత్యం అలర్ట్గా ఉండే పోలీసులు ఏమయ్యారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన స్వయానా మాజీ ఎమ్మెల్సీ మేరి రవీంద్రనాథ్ అల్లుడు. ఎన్నికల కోడ్ సమయంలో తుపాకీని బయటికి తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
- March 22, 2021
- Archive
- CM KCR
- HYDERABAD
- MLC ELECTIONS
- TELANGANA
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- తెంగాణ భవన్
- సీఎం కేసీఆర్
- హైదరాబాద్
- Comments Off on ఎమ్మెల్సీ సంబరాల్లో తుపాకీ కలకలం