సామాజిక సారథి, రామకృష్ణాపూర్: బాధిత కుటుంబానికి చేయూతనందించినట్లు జీఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజారమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలటీలోని ఆర్కేవన్ సుభాష్ నగర్ కు చెందిన మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి కుమారుడు ఆటో నడుపుతూ జీవనాన్ని దినదినగండంగా గడుపుతున్నాడని తెలిపారు. బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5వేల నగదు, 50 కిలోల బియ్య, నిత్యవసర వస్తువులను పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ సభ్యులు కిరణ్, సురేష్, రవి తెలిపారు.
- November 1, 2022
- Archive
- లోకల్ న్యూస్
- District
- Foundation
- GSR
- MANCHIRYALA
- Municipality
- ramakrishnapur
- Comments Off on బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ చేయూత