- సామాజిక సారథి ఎఫెక్ట్..
సామాజిక సారథి, చిలప్ చెడ్: మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతారం ధాన్యం కొనుగోలు సెంటర్లో రైతులను దోపిడీ చేస్తున్న విధానంపై ఈనెల 26న ‘సామాజికసారథి’లో ‘వడ్ల తూకవేస్తున్నారు’ శీర్షికన కథనం వచ్చింది. నెలరోజులుగా రైతుల పడిగాపులు, సంచికి రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారనే విషయాలు వెలుగుచూశాయి. దీనికి స్పందించిన ఐకేపీ అధికారులు లారీలను సక్రమంగా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. రైతుల వడ్ల కుప్పలను సోమవారం సంచుల్లో నింపి లారీల్లో వడ్ల లోడు నింపారు. రైతుల నుంచి ఒక్కో సంచికి రూ.3 తీసుకున్నారు.