– ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సామాజిక సారథి, సిద్దిపేట: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం హుస్నాబాద్ పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్, రంగ నాయక్ తోపాటు ఇతర ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు ఏ ప్యాకేజీ అందించారో అదే విధంగా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు క్రింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అదే ప్యాకేజీని వర్తింపజేశాయన్నారు. కాళేశ్వరం జలాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అందించిన తర్వాతే రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు అందించడంతో పాటు వచ్చే అక్టోబర్ కల్లా గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జిల్లా నాయకులు కేడం లింగమూర్తి, కొమటి సత్యనారాయణ, పట్టణాధ్యక్షులు అక్కు శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు కొమటి స్వర్ణలత, నియోజకవర్గంలోని పలు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ ముఖ్యనేతలు తదితరులు పాల్గొన్నారు.