Breaking News

ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్​ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి విధంగా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పెసరి రాజమౌళి నాయకులు అశోక్, పంజల జగన్మోహన్ మామిడి తిరుపతి, మాదం రమేష్, రాగం లచ్చయ్య, అజీజ్ మొయిజ్, బర్కత్ తదితరులు పాల్గొన్నారు.