- ములుగు ఎమ్మెల్యే సీతక్క
సామజిక సారథి, మంగపేట: సభ్యత్వ నమోదుపై కాంగ్రెస్ నాయకులు దృష్టిసారించాలని, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ మండల నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదంలో మరణిస్తే రూ.2లక్షల ఇన్స్ రెన్స్ వర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.