సారథి, రాయికల్: కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను జగిత్యాల జిల్లా డీఆర్డీఏ విజిలెన్స్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ దేవేందర్ రెడ్డి, డీఆర్డీఏ జిల్లా ఎస్బీఎం కన్సల్టెంట్ జి.చిరంజీవి శుక్రవారం పరిశీలించారు. వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, సానిటరీ వర్క్, పరిశుభ్రత, నర్సరీ, పల్లెప్రకృతి వనం పనులను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఇనుముల రమేష్, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉపసర్పంచ్ అన్నవేణి వేణు, వైస్ ఎంపీపీ వై.మహేశ్వర్ రావు, ఉపాధి హామీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ దీపిక, పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ పాల్గొన్నారు.
- April 30, 2021
- Archive
- కరీంనగర్
- KARIMNAGAR
- PALLEPRAGATHI
- rayjkal
- కరీంనగర్
- పల్లెప్రగతి
- రాయికల్
- Comments Off on పల్లెప్రగతి పనుల పరిశీలన