సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రేపు సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబుతో మూవీ విశేషాలు..‘‘వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. శ్రీకాంత్ గారిది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. కానీ, ఉన్నంత సేపూ ఇంపాక్ట్ చూపిస్తుంది. భరత్‌కి కూడా రెండు మూడు యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుని యాక్షన్ సీక్వెన్సులు చేశా. నేను స్పోర్ట్స్ పర్సన్ కావడం వల్ల ఈజీ అయ్యింది. రియల్ లైఫ్‌లో ఎప్పుడూ పోలీస్ అవ్వాలని అనుకోలేదు. కానీ యాక్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా పోలీస్ క్యారెక్టర్ చేయాలనుకుంటారు. అర్జున్ ఎ, బి… నా పాత్రలో రెండు వేరియేషన్స్ చూస్తారు. ఇందులో ప్రేమకథ లేదు. హీరోయిన్ లేదు, ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎక్కువ చెప్పలేను. ప్రతి హీరో అటెంప్ట్ చేసే స్టోరీ కాదు. నేను ఈ విధంగా చేయడం ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనేది చూడాలని ఉంది. మనం సినిమా ఎంత బాగా చేసినా రిజల్ట్ మీద చాలా ప్రభావాలు ఉంటాయి. తమిళంలో విడుదల చేసే ఆలోచన ముందు అయితే లేదు. వారం క్రితం చర్చల్లోకి వచ్చింది, చేస్తే బావుంటుందని అనిపించింది. నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మామా మశ్చీంద్ర’ అని ఓ సినిమా చేస్తున్నాను. ఇది కామెడీ అండ్ యాక్షన్ జానర్ సినిమా. ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. అందులో ట్రిపుల్ రోల్ చేస్తున్నాను. యువి క్రియేషన్స్ లో ఇంకో సినిమా ఉంది. తండ్రీ కొడుకుల మధ్య జరిగే డ్రామా అది. రెండు మూడు రోజుల్లో టైటిల్ అనౌన్స్ చేస్తారు”అంటూ చెప్పారు.
- January 25, 2023
- Archive
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- సినిమా
- Cinema
- Sudhir Babu
- Comments Off on ఎంగేజింగ్ థ్రిల్లర్–- సుధీర్ బాబు ఇంటర్వ్యూ