Breaking News

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి: ఎటువంటి చిన్న పొరపాటు,  సంఘటన జరగకుండా మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ  శాసన మండలి ఎన్నిక   ప్రశాంతంగా,  సాఫీగా జరిగేలా  చూడాలని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పోలింగ్ అధికారులకు సూచించారు.   ఈ నెల 10 న   మెదక్ శాసన  మండలికి  జరగగున్న ఎన్నికల సందర్భంగా గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో (9) పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వచ్చిన పోలింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులనుద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలు  చాలా  సునిశితమని,  వెబ్ కాస్టింగ్ ఉంటుంది కాబట్టి  అందరు  అధికారులు అప్రమత్తంగా ఉండి పోలింగ్  కేంద్రంలో ప్రతి అంశాన్ని డేగ కళ్లతో పరిశీలిస్తుండాలని,  మీ కనుసన్నలలో పోలింగ్ జరిగేలా చూడాలని  అన్నారు. అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి హరీష్ మాట్లాడుతూ మెదక్ ఉమ్మడి జిల్లాలో 1,026 మంది ఓటర్లు ఉన్నారని, వీరు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు సంగారెడ్డి  జిల్లాలో లో 4, మెదక్ లో 3, సిద్ధిపేట లో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. తిరిగి ఈ నెల 14 న ఇదే బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 4 టేబుళ్ల ద్వారా ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్,  సహాయ ఎన్నికల అధికారి రమేష్, స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి, తూప్రాన్ డిఎస్పీ కిరణ్, తదితరులు ఉన్నారు.