నేచురల్ స్టార్ నాని మరికొన్ని రోజుల్లో ‘దసరా’తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ‘దసరా’ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్లో బీడీ ముట్టించుకుని విసిరేసిన అగ్గిపుల్లతో చెలరేగిన మంటల విజువల్స్ తో డిజైన్ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. ఈ నెల 30న టీజర్ విడుదల చేస్తున్నామని తెలిపాడు. ప్రమోషన్స్‌లో భాగంగా నాని అభిమానుల కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఫొటో సెషన్ కూడా ఏర్పాటు చేశాడు. ఇందులో నానీకి జోడీగా కీర్తిసురేశ్ నటిస్తోంది. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
- January 26, 2023
- Archive
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- సినిమా
- Cinema
- Comments Off on ఈ నెల 30న ‘దసరా’ టీజర్