Breaking News

నీలికండువా కప్పుకోనున్న ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్

నీలికండువా కప్పుకోనున్న ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్

  • ఆగస్టు 8న పార్టీ కోఆర్డినేటర్ రాంజీగౌతమ్ ​సమక్షంలో బీఎస్పీలో చేరిక
  • నల్లగొండ ఎన్ జీ కాలేజీ గ్రౌండ్​లో భారీ బహిరంగ సభకు శ్రీకారం

సారథి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల సంస్థ పూర్వ కార్యదర్శి, ఇటీవలే వీఆర్ఎస్​తీసుకున్న ఐపీఎస్​ఆఫీసర్​డాక్టర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​బహుజన సమాజ్​పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. తన అభిమానులు, అనుచరులతో కలిసి పెద్దసంఖ్యలో పార్టీ కోఆర్డినేటర్ రాంజీగౌతమ్​సమక్షంలో ఆగస్టు 8న బీఎస్పీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్​జీ కాలేజీ మైదానంలో ఐదులక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాటుచేశారు. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అనే మూడు సిద్ధాంతాలతో బహుజన సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చేందుకు తన ఉన్నతమైన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. తన 26 ఏళ్ల పదవీకాలంలో పేదవర్గాలకు ఒకశాతం మాత్రమే తనవంతు చేయగలిగానని, 99శాతం చేయాల్సి ఉందని, అది బహుజనులకు రాజ్యాధికారం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. కానీ పూలే, అంబేద్కర్, కాన్షీరాం అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించారు. ఈ నెల 19న రాజీనామా అనంతరం టీఆర్ఎస్​వైపు వెళ్తారని, సోషల్​మీడియాలో విస్తృతంగా జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. మరోవైపు తాను రాజకీయాల్లోకి వచ్చేది ఖాయమేనని, కానీ ఎప్పుడు వస్తాననేది త్వరలోనే చెప్తానంటూ దాటవేస్తూ వచ్చారు. కానీ అందరి ఊహాగానాలను తలకిందులు చేస్తూ ఆయన నీలికండువా కప్పుకోనున్నారు. డాక్టర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​పార్టీలో చేరుతున్న సందర్భంగా రాష్ట్ర నలమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదవర్గాల ప్రజలు లక్షలాదిగా నల్లగొండకు తరలిరావాలని బీఎస్పీ నాయకులు కోరారు.

One thought on “నీలికండువా కప్పుకోనున్న ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్”

Comments are closed.