Breaking News

బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

సారథి, పెద్దశంకరంపేట: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అల్లాదుర్గం సీఐ జార్జ్ అన్నారు. గురువారం ఆయన పెద్దశంకరంపేట్ లో లాక్ డౌన్ పరిస్థితిపై పర్యవేక్షించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రజలంతా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పికెట్లు, ప్రధాన రహదారిపై చెక్ పోస్టులను ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కృషి చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావొద్దన్నారు. పత్రిక ప్రతినిధులు, వైద్యసిబ్బంది, తమ ఐడీ కార్డులను వెంట తీసుకుని రావాలని సూచించారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. ఆయన వెంట పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.